28 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక..
నారాయణ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Jun 08,2025 08:26 pm
నల్గొండ: మిర్యాలగూడలోని నారాయణ విద్యాలయం 1996-97 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. నాటి గురువులతో కలిసి వైభవంగా నిర్వహించారు. ఉపాధ్యాయులకు మెమొంటోలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. 28 ఏళ్ల తర్వాత బాల్య మిత్రులంతా ఒకచోట చేరి ఒకరికొకరు తమ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుని సరదాగా గడిపారు.