కొండగట్టు దిగువ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొండగట్టుకు చెందిన ఉప్పు రమణారెడ్డి(30)కి కొందరి యువకులతో ఈ నెల 2న గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆ యువకులు రమణారెడ్డిపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మెట్ల దారి పక్కన పూడ్చిపెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.