జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత
NEWS Jun 08,2025 08:14 am
బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. తనకు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. తనకు 62 ఏళ్లు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓటమి అన్నది చూడలేదు. తను రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. సినీ నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.