స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొలగింపు నిజమే
NEWS Jun 08,2025 07:52 am
ఎంపీ శ్రీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగించింది నిజమేనని అన్నారు. అవసరమైన మేరకు కార్మికులను ఉంచుకుని మిగతావారిని తొలగిస్తున్నారని చెప్పారు. మళ్లీ బ్లాస్ట్, ఫర్నెస్ త్రీ ప్రారంభిస్తారని తెలిపారు. అప్పుడు అవసరమైతే కొంతమందిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు, యాజమాన్యం కలిసి పని చేయాల్సి ఉందన్నారు.