ఎంపీ వంశీపై ఎమ్మెల్యే ఠాకూర్ కామెంట్స్
NEWS Jun 08,2025 07:44 am
పెద్దపల్లి ఎంపీ వంశీ వాదనపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కామెంట్స్ చేశారు. సరస్వతి పుష్కరాలలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగ లేదన్నారు. ఒకరిని చిన్న చూపు చూపారనేది అవాస్తవం అన్నారు. ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పడం వెనక మర్మం వేరే ఉందన్నారు. 15 రోజుల తర్వాత ఆ మర్మం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ఫోటోలు వేయరని ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. వంశీ చిన్న పిల్లోడని, తనకు మంచి ఫ్యూచర్ ఉందన్నారు.