మాజీ మంత్రి జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను అరెస్ట్ చేస్తారని అనుకున్నానని కానీ తన కొడుకు జోలికి వెళతారని అనుకోలేదన్నారు. తన అరెస్ట్ తో 10 రోజులు నరకం చూశామన్నారు. ఈ రెడ్ బుక్ పేరుతో వేధింపులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నిక్కర్లు వేసుకునేటప్పటి నుంచి తాను రాజకీయాలలో ఉన్నానని అన్నారు. ఇలాంటి రెడ్ బుక్ లు చాలా చూశానని చెప్పారు. పాలన చేయమని అధికారం ఇస్తే ఈ కేసులు ఏంటి అంటూ మండిపడ్డారు.