గూగుల్ సంస్థకు భూ కేటాయింపులు
NEWS Jun 07,2025 10:14 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ కు భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు , ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో గూగుల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ మేరకు ఏపీ సర్కార్ తో గూగుల్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా అనంతవరం, నెక్కల్లు మధ్య గూగుల్ సంస్థ ఏర్పాటు చేసేందుకు 143 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ఇప్పటికే స్థలాన్ని పరిశీలించిన గూగుల్ ప్రతినిధులు.