ధర్మారెడ్డి నిర్వాకం జనసేన ఆగ్రహం
NEWS Jun 07,2025 02:58 pm
టీటీడీలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యుడు ఆనాడు ఈవోగా పని చేసిన ధర్మా రెడ్డేనని సంచలన ఆరోపణలు చేశారు తిరుపతి జనసేన పార్టీ చీఫ్ కిరణ్ రాయల్. గతంలో తిరుపతి శ్రీవారి ప్రసాదం తయారీకి పంపిణీ చేసింది నెయ్యి పూర్తిగా కల్తీనేని తేలిందన్నారు. తను పని చేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై పూర్తిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తనను విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు లేఖ రాశానని చెప్పారు.