ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలి - సీఎం
NEWS Jun 07,2025 02:05 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12వ తేదీన విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం జరుగు తుందన్నారు సీఎం చంద్రబాబు. ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోతే వారికే ఎక్కువ నష్టం జరగుతుందని హెచ్చరించారు. మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలి పోకూడదు అనేది తన ఆలోచన అని పేర్కొన్నారు.