టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు పార్టీ కాదు కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నిక్లలో రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామంటూ ప్రకటించారు. తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే గా ఒకసారి ఎంపీగా గెలిచిన చరిత్ర తన తండ్రిది.