హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించే బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలిపారు సీఎం చంద్రబాబు. భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియ చేస్తుందన్నారు. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించే వారే నిజమైన దైవ భక్తులన్నారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.