ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం
NEWS Jun 07,2025 08:42 am
ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టామన్నారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం అని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులకు అభినందనలు తెలిపారు.