కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల
NEWS Jun 07,2025 08:16 am
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై మరోసారి భగ్గుమన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనిపై బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టాండ్ కూడా ఇదేనా అని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తలా ఒక మాట మాట్లాడుతూ ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.