మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం - సీఎం
NEWS Jun 07,2025 08:10 am
సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు నూరైనా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. దాని చుట్టు పక్కల ఉన్న వారంతా పాలమూరు, నల్లగొండ వాసులేనని, వారికి వేయి ఎకరాలు కేటాయిస్తామన్నారు. అందుకే ఖాళీ చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు సీఎం. కొందరు కావాలని మూసీ పక్కన ఉన్నవారి ఇళ్లను కూలుస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 50 వేలు జేబులో లేని మందుల సామేల్‌ను 50 వేల మెజార్టీతో నల్గొండ జిల్లా ప్రజలు గెలిపించారని ప్రశంసించారు.