కూటమి పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం
NEWS Jun 06,2025 08:35 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు పాలన అంతా బక్వాస్ అంటూ పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయి పోయాయన్నారు. రాజకీయ కక్షలతో నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్ప కూలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందంటూ వాపోయారు. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.