మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై కేసు నమోదు కావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేతలు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.