బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేను ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే సీపీ దయానంద్ తో పాటు డీఎస్పీపై వేటు వేసింది. రిటైర్డ్ జడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆర్సీబీ ప్రతినిధులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది డీజీపీని.