కర్ణాటక సీపీ, డీసీపీలపై వేటు
NEWS Jun 06,2025 07:44 am
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్ అయ్యింది. సీఎం ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తో పాటు డీఎస్పీలపై వేటు వేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏ1గా ఆర్సీబీ, ఏ2గా ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఏ3గా KSCA నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది.