జగన్ పై భగ్గుమన్న సత్యకుమార్
NEWS Jun 05,2025 09:10 pm
మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. నేరస్థులను జగన్ పరామర్శించడం అప్రజాస్వామికమన్నారు. నేరస్థులను ప్రోత్సహించడం తనకు అలవాటుగా మారిందని ఆరోపించారు. గత ఐదేళ్లు ఆయన చేసిన పాలన ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. అవినీతి, అక్రమాలు, నేరస్థులకు అడ్డాగా ఏపీని చేశారని ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని పేర్కొన్నారు.