ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
NEWS Jun 05,2025 08:05 am
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రక్షిత మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు ఓకే చెప్పింది. వైఎస్సాఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోదం ముద్ర వేసింది.