శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు
NEWS Jun 05,2025 07:48 am
తిరుమల శ్రీవారిని 78 వేల 288 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 32 వేల 79 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు.