బెంగళూరు ఘటనకు డీకేదే బాధ్యత
NEWS Jun 05,2025 06:36 am
బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనలో 11 మంది మృతి చెందడం, 50 మందికి పైగా గాయపడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమార స్వామి. ఇది పూర్తిగా రాష్ట్ర సర్కార్ వైఫల్యమేనని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్ష మందికి పైగా హాజరైన సమయంలో 5 వేల మంది పోలీసులను మోహరిస్తే ఎలా కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.