బెంగళూరు ఘటన బాధాకరం
NEWS Jun 05,2025 06:33 am
ఆర్సీబీ విజయోత్సవ సభ విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. తాజా సంఘటనపై స్పందించారు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్, కుంబ్లే, అజహరుద్దీన్ , తదితరులు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనకు మాటలు రావడం లేదని, బాధ కలిగించిందని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ. బీసీసీఐ తీవ్ర సంతాపం తెలిపింది. ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.