టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి రోజూ ఇచ్చే దివ్య దర్శనం టికెట్ల కౌంటర్లను మార్చుతున్నట్లు తెలిపింది. శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కి మార్చాలని నిర్ణయించినట్లు పేర్కొంది. శుక్రవారం సాయంత్రం నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో కొత్త కౌంటర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది.