ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు
NEWS Jun 04,2025 12:09 pm
రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజుకు ప్రత్యేకత ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా పేర్కొన్నారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు అని మరోసారి గుర్తు చేశారు. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు అని పేర్కొన్నారు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు.ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు అని అభివర్ణించారు.