ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని అన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం తను చేసిన తప్పా అని నిలదీశారు సర్కార్ ను. అభివృద్దిలో నెంబర్ వన్ గా నిలపడం తప్పా అన్నారు. ఇది కాలేశ్వరం కమిషన్ కాదని అది కాంగ్రెస్ కమిషన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.