ప్రభుత్వ భూముల అమ్మకానికి వేలం
NEWS Jun 04,2025 10:23 am
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది. ఇందులో భాగంగా అత్యంత విలువైన హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం పాటకు పెట్టనుంది. దాదాపు రూ.500 నుండి రూ.600 కోట్ల ఆదాయం రానుందని, వీటి ద్వారా వచ్చిన డబ్బులను ఇందిరమ్మ ఇళ్లకు వినియోగించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం . వచ్చే సెప్టెంబర్ నెల లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.