ఐపీఎల్ విజేత ఆర్సీబీకి జగన్ కంగ్రాట్స్
NEWS Jun 04,2025 10:16 am
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 కప్ ను చేజిక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధానంగా ఆ జట్టు ఆడిన ఆట తీరు ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. ఈ సందర్బంగా విశ్వ విజేతగా అవతరించిన ఆర్సీబీ స్కిప్పర్ రజత్ పాటిదార్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు, హెడ్ కోచ్, సాంకేతిక సిబ్బందికి అభినందనలు తెలిపారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి. మీ గెలుపు ఎందరికో స్పూర్తి దాయకంగా ఉంటుందన్నాడు.