విరాట్ కోహ్లీ ఎమోషనల్ వైరల్
NEWS Jun 04,2025 09:16 am
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ పోరులో 18 ఏళ్ల సుదీర్గ విరామం తర్వాత ఆర్సీబీ విజేతగా నిలిచింది. ప్రత్యర్థి పంజాబ్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ సీజన్ నుంచి బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు కోహ్లీ. ఇటీవలే టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ఆట పరంగా పరుగుల వరద పారించిన తను ఇలా అర్ధాంతరంగా నిష్క్రమించడం బాధకు గురి చేసింది. తన కల నెరవేరడంతో కప్ ను ముద్దాడాడు. తట్టుకోలేక కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.