అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 184 పరుగులకే పరిమితమైంది. 18 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవడం విశేషం. విరాట్ కోహ్లీ కంట తడి పెట్టాడు. భారీ ప్రైజ్ మనీ దక్కింది .