బీసీసీఐ తాత్కాలిక చీఫ్ గా రాజీవ్ శుక్లా
NEWS Jun 02,2025 11:57 am
ప్రపంచ క్రికెట్ లోనే అత్యధిక ఆదాయం కలిగిన ఏకైక క్రికెట్ సంస్థ బీసీసీఐకి స్టాండింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ పాలక వర్గం కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్న మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ పదవీ కాలం త్వరలోనే పూర్తవుతుంది. దీంతో ఎవరు చీఫ్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి తెర దించింది బీసీసీఐ.