దర్జాగా ఐపీఎల్ ఫైనల్ కు పంజాబ్ కింగ్స్
NEWS Jun 02,2025 10:31 am
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. టార్గెట్ ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తను 41 బంతుల్లో 87 రన్స్ చేయగా నేహాల్ వధేరా 48 రన్స్ , జోస్ ఇంగ్లీష్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. 5 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. 12 ఏళ్ల తర్వాత గెలుపు బాట పట్టింది పంజాబ్.