తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Jun 02,2025 10:02 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ప్రతి రోజూ 80 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 78 వేల 631 మంది దర్శించుకున్నారు. 32 వేల 936 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం ఏటీజీహెచ్ వరకు క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం దర్శనం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.