బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. . బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. సీఎం అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలన్నారు. దేశవ్యాప్త కులగణన కాదు ముందు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలన్నారు. బీసీలు రాజకీయ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీసీలు రాజకీయ శక్తిగా ఏర్పడి అధికారాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. దేశవ్యాప్త కులగణ కోసం త్వరలోనే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.