భక్తులను రెచ్చగొడితే ఊరుకోం
NEWS Jun 01,2025 11:26 am
కొందరు కావాలని భక్తులను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం, మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ప్రతి రోజూ స్వామి వారి దర్శనం కోసం 90 వేల మందికి పైగా వస్తున్నారని, వారాంతపు సెలవుల్లో లక్షా 20 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు సైతం పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.