తిరుమల క్షేత్రం భక్తులతో కిట కిట
NEWS Jun 01,2025 10:55 am
పుణ్య క్షేత్రం తిరుమల కిట కిట లాడుతోంది భక్త బాంధవులతో. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 95 వేల 80 మంది భక్తులు దర్శించుకున్నారు. 39 వేల 668 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.