మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పేద ప్రజల పాలిట కూటమి సర్కార్ శాపంగా మారిందని ఆరోపించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి అందకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పేదలు బాగు పడటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీల జపం చేయడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదన్నారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు నష్టం కలిగించే చర్యలు తగవన్నారు.