చాయ్ తయారు చేసిన మంత్రి అనిత
NEWS May 31,2025 01:06 pm
పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న టిడిపి కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. అనంతరం గోవింద్ ఇంటికి వెళ్లిన మంత్రి అనిత స్వయంగా టీ కాచి, ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్బంగా రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.