పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి. థియేటర్లు బంద్ చేస్తామంటూ ఎవరూ ప్రకటించ లేదన్నారు. బంద్ ప్రకటిస్తే మూడు వారాల ముందే నోటీసులు ఇస్తారని అన్నారు. ఈ విషయం తెలుసు కోకుండా ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. హరి హర వీరమల్లుపై కుట్ర చేశారంటూ ఎలా చెబుతారని నిలదీశారు. తన సినిమా మైలేజ్ కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు.