ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తివేశారు. కిందకు నీళ్లు వదిలారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 97 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 88 వేల 835 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.550 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నాలుగు యూనిట్లలో 156 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.