ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని భూపాల్ లో పర్యటించారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. క్షిప్రా నదిపై రూ.860 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఘాట్ నిర్మాణ పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. భారత్ అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళుతోందన్నారు పీఎం.