సర్దుబాటు ఉత్తర్వులను పున: పరిశీలించుకోవాలి
NEWS May 31,2025 06:34 pm
మెదక్ తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం తపస్ మెదక్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులు లేకుండా చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం సత్వరమే సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర్వులను పునః పరిశీలించాలని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా బాధ్యులు నర్సింలు, వినోద్, మాధవరెడ్డి,మార్గం రాజు, సిద్దు, సత్యనారాయణ, కిషన్, దశరథం, కృష్ణ పాల్గొన్నారు.