ఏలూరు జిల్లాలో కరోనా ప్రభావం కనిపిస్తోంది. జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ నలుగురు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో పని చేసే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. నాలుగు రోజుల కిందట శాంతి నగర్ లో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ సోకింది. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.