ఐపీఎల్ 2025 ఫైనల్ లో నువ్వా నేనా
NEWS May 31,2025 12:23 pm
ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది ఐపీఎల్ 2025 . ఫైనల్ మ్యాచ్ కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ , రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరగనుంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ముంబై పటిష్టంగా ఉందని అలాగని ఆర్సీబీని తీసి పారేయలేమన్నాడు. ముంబై బౌలర్లు టాప్ లో ఉన్నారని కోహ్లీ ఆడితేనే కప్ కొట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నాడు.