ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువజాం నుంచే వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.