గండిహనుమాన్ అంతరజిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ను డా. మనీషా పటేల్ తనిఖీ
NEWS May 29,2025 08:27 pm
బక్రీద్ పండగ నేపథ్యంలో పోలీస్, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గండిహనుమాన్ అంతరజిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ను డా. మనీషా పటేల్ తనిఖీ చేసారు. గోవధ చట్టరీత్యా నేరం గోవధ నిషేధ చట్టం ప్రకారం ఆవులని, దూడలను చంపకూడదు. ఎద్దు, దున్న, గేదె 14 సంవత్సరాలు దాటి, బ్రీడింగ్, వ్యవసాయంకు నిరూపయోగమని పశువైద్యుడి ధ్రువీకరణ ఉండాలని, అలాగే పశువులని ప్రభుత్వ అనుమతి ఉన్న పశువధశాలలో మాత్రమే వధించాలన్నారు. కావున పశువుల విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.