రోజు రోజుకు అమెరికాలో ఉండడమే గగనంగా మారింది. కొత్తగా కొలువు తీరిన ట్రంప్ సర్కార్ ఉక్కు పాదం మోపుతోంది. ప్రధానంగా విదేశీ విద్యార్థులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. యూఎస్ ఎంబసీల్లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపి వేశారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను సైతం పరిశీలిస్తున్నారు. కఠిన ఆంక్షలు తీసుకోవడంతో ప్రధానంగా భారత్ కు చెందిన స్టూడెంట్స్ షాక్ కు గురవుతున్నారు.