హక్కుల ఉల్లంఘన జూపూడి ఆందోళన
NEWS May 29,2025 06:24 am
రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపైన దాడులు కామన్‌గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారని వాపోయారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.