పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు: ఎస్పీ
NEWS May 28,2025 11:31 pm
జగిత్యాల జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతామన్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీసులు షిఫ్టులవారీగా సమన్వయంతో పని చేస్తారని పేర్కొన్నారు. పశువుల రవాణా నిబంధనల ప్రకారం జరగాలని, అనుమతి పత్రాలు లేకుండా ఆవులు, దూడలను రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.