బ్లాక్ బెల్ట్ విద్యార్థులకు డీఎస్పీ అభినందన
NEWS May 28,2025 11:35 pm
హైదరాబాదులో నిర్వహించిన కరాటేలో జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్ సాధించిన మెట్ పల్లి కేంద్రానికి చెందిన ఐదుగురు విద్యార్థులను డీఎస్పీ రాములు అభినందించారు. శ్రేయాన్ కార్తిక్, జి. శ్రికేష్, వి. శ్రీవాస్తవ్, ఎ. కృతిక్, వి. శ్రీనిధి సాధించిన ప్రశంసా పత్రాలు, పథకాలను వారికి అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో కరాటే శిక్షకులు వంశీ నాయుడు, ప్రవీణ్ కుమార్, సురేందర్ తదితరులున్నారు.